Hasyam

‘నవ్వడం ఒక భోగం ... నవ్వించడం ఒక యోగం ... నవ్వలేక పోవడం ఒక రోగం’

ఈ సూక్తి మనందరికీ తెలిసినదే. మనిషి ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో జీవించాలంటే ఆత్మసంతృప్తి, అనురాగపూరిత కుటుంబం, హాస్యపూరిత వాతావరణం ఎంతో ముఖ్యం. ఆ అంశాన్ని దృష్టిలో వుంచుకొని మన సిరిమల్లె పాఠకుల కొరకు ఒక హాస్యవల్లరి శీర్షికను ప్రారంభిస్తున్నాం. ఇందులో కొత్త, పాత జోకులు మిళితమై వుంటాయి. మీరు వ్రాసిన, సేకరించిన, మీకు నచ్చిన జోకులను మాకు పంపితే ప్రచురిస్తాం. తప్పక పంపగలరు. పదిమందికి మీ నవ్వును అందించగలరు.

divider

 

నాన్న: ఒరేయ్ శీనూ, ఈరోజు మీ అమ్మ పుట్టినరోజు కదా, విష్ చేసావా?
శీను: ఆ, పొద్దున్నే FB లో పోస్ట్ చేసేసాను నాన్నా.

నాన్నకి కొంచెం కోపమొచ్చినా, ఏమీ అనకుండా పేపర్ చదువుకుంటూ హాల్లో కూర్చుండిపోయారు.

ఓ పదిహేను నిమిషాల తరువాత,

శీను: అమ్మా, నేను బయటకి వెళ్ళాలి టిఫిన్ పెట్టు.
అమ్మ (వంటింటి నుండి): అయ్యో టిఫిన్ వాట్సాప్ లో పంపించి చాలా సేపు అయ్యిందిరా, త్వరగా తినెయ్ మళ్ళీ చల్లారిపోతుంది.

నాన్నగారు కుష్, శీనుగాడు షాక్!

 

 

పాల వాళ్ళు ధర్నా చేస్తే పాలు రోడ్ మీద పార పోస్తారు ..

కూరగాయల వాళ్ళు ధర్నా చేస్తే కూరగాయలు అన్ని తెచ్చి రోడ్ మీద పడేస్తారు.

ఈ బ్యాంక్ వాళ్ళకి ఎప్పుడు బుద్ది వస్తుందో  .. ఎప్పుడు ధర్నాలు చేసి డబ్బులు రోడ్ మీద పడేస్తారో.....

 

divider

 

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

సోమరితనం అనేది ఒక రాచవ్యాధి. ఒకసారి అది సోకిందంటే, యింక ఆ రోగి ఎన్నటికీ బాగుపడలేడు – ప్రేంచంద్