ఆంగ్లంలో తేట తెలుగు

చెప్పుకోండి చూద్దాము??

ఈ క్రింద కొన్ని ఆంగ్ల సామెతలు ఇవ్వబడ్డాయి. వీటి భావానికి సరిపడే సామెతలు తెలుగులో కనుక్కోండి.

 1. Make Hay While Sun Shines
 2. Let Bygones Be Bygones
 3. Health Is Wealth
 4. Like Father Like Son
 5. Man Proposes God Disposes
 6. All That Glitters Is Not Gold
 7. There Is No Smoke Without Fire
 8. Walls have Ears
 9. A Friend In Need Is A Friend In Deed
 10. Don’t Make A  Mountain Out Of A Mole Hill

సమాధానమునకై ఇక్కడ క్లిక్ చేయండి »

 1. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి
 2. గతం గతః
 3. ఆరోగ్యమే మహాభాగ్యము
 4. యథా రాజా తథా ప్రజా
 5. తానొకటి తలిస్తే  దైవమొకటి తలచినట్లు
 6. మెరిసేదంతా బంగారం కాదు
 7. నిప్పు లేందే పొగ రాదు
 8. గోడలకు  చెవులుంటాయి
 9. అవసరానికి ఆదుకునేవాడే అసలైన స్నేహితుడు
 10. గోరంతలు కొండంతలు చేయొద్దు

 

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

సోమరితనం అనేది ఒక రాచవ్యాధి. ఒకసారి అది సోకిందంటే, యింక ఆ రోగి ఎన్నటికీ బాగుపడలేడు – ప్రేంచంద్