ఓంనఘాట్ నది, దావ్కి, మేఘాలయ, ఇండియా


మనిషి మానసిక ఒత్తిడులను అధికమించి ఆరోగ్యకరంగా ఉండాలంటే ప్రకృతి ఒడిలో సేదతీరితే చాలు. ఎటువంటి రుగ్మతలైనా మటుమాయమై, అనిర్వచనీయమైన అనుభూతి మన సొంతమౌతుంది. ముఖ్యంగా క్రింద చూపినటువంటి  ప్రకృతి సౌందర్యాలను సందర్శిస్తే చెప్పలేని మనోల్లాసం మన సొంతమౌతుంది.

మేఘాలయ-షిల్లాంగ్ ప్రాంతంలో ప్రవహిస్తున్న ఓంనఘాట్ నది లోని నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే ఆ నది అడుగుభాగం కూడా ఎంతో స్పష్టంగా మనకు కనపడుతుంది. దావ్కి అనే ప్రాంతం భారతదేశం-బంగ్లాదేశ సరిహద్దులో వుంది. ఈ ఓంనఘాట్ నది ఈ రెండు దేశాల మధ్య ప్రవహిస్తూ వుంది. ఈ నది మీదే బ్రిటిష్ వారు ఒక వేలాడే వంతెనను 1932 లో రెండుదేశాలను కలుపుతూ నిర్మించారు. నేటికీ ఆ వంతెన ఎంతో పటిష్టంగా ఉండి ఎంతో ఉపయోగకరంగా ఉంది.

omnagat-temple


ఈ చిత్రాలను చూస్తుంటే నదిలోని పడవలన్నీ నీటి మీద వెళుతున్నట్లు లేదు, గాలిలో తేలుతున్నట్లు ఉంది. ఈ నదిలో వున్న ఇసుక రంగు కూడా తెల్లగా వుండి, ఎక్కువ నాచు ఏర్పడనందువలన నీరు తన సహజమైన రంగు (రంగులేదు)లో కనపడుతున్నది.

 

divider

 

Source: tripoto.com, tripadvisor.com

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

సోమరితనం అనేది ఒక రాచవ్యాధి. ఒకసారి అది సోకిందంటే, యింక ఆ రోగి ఎన్నటికీ బాగుపడలేడు – ప్రేంచంద్