వర వీణా మృదుపాణి
- విద్యార్థి

 

← గత భాగము

వివిధ దేశాలలో సరస్వతీ దేవి
Sarasvati around the world

Saraswati baltimore

సరస్వతి (లలితాసనము),
10-11వ శతాబ్దము
వాల్టర్స్ మ్యూజియమ్, బాల్టిమూర్
భారత దేశములో ఎక్కడ లభ్యమైనదనే వివరములు లేవు.
Saraswati (Lalitasana),
10-11th CE
Walter’s museum, Baltimore, Maryland
Origin from India, unknown

saraswati-internet

సరస్వతి (లలితాసనము), 21వ శతాబ్దము
గృహాలంకరణ కొరకు ఇంటెర్నెట్ లో అమ్మకమునకు ఉన్న విగ్రహం
Saraswati statue, 21st CE
Available on Internet, for interior decor

కాదంబరి, రవి వర్మ
Kadambari, Ravi Varma

saraswati-ravivarma

సరస్వతి, రవి వర్మ
Saraswati, Ravi Varma

likhitha-bapu

లిఖిత, బాపు
   Likhita, Bapu  

saraswati-bapu

సరస్వతి, బాపు
Saraswati, Bapu

మనకు లభ్యమౌతున్న సరస్వతీ దేవి అతి ప్రాచీన సంపూర్ణ విగ్రహము 10 లేక 11వ శతాబ్దానికి చెందినది. ఈ విగ్రహము భారత దేశములో ఎక్కడ లభ్యమైనదీ తెలియడము లేదు. ప్రస్తుతము అమెరికాలోని బాల్టిమోర్ నగరములోని వాల్టర్స్ మ్యూజియమ్ లో ఉన్నది. ఈ విగ్రహము యొక్క భంగిమ నాట్యశాస్త్ర లలితాసనము రీతికి చెందినది. ఆవిడ చేతిలో ఉన్న వీణ ఏకతార. 9 నుండీ 10 వ శతాబ్దపు లక్ష్మీ, పార్వతీ దేవి విగ్రహాలు కూడా, ఈ భంగిమలోనే ఆశీనులై ఉండడము గమనించవచ్చు.

రాజా రవి వర్మ చిత్ర లేఖనములు ఒక మౌలికమైన స్వచ్ఛత కలిగి ఉంటాయి. ఆయన బుద్ధిపూర్వకముగానో, లేక ఆలవోకగానో స్త్రీల భంగిమలు, చీర కట్టు పద్దతులను పరిశోధించారు. 19వ శతాబ్దిలో, భారత దేశములో పలు రకముల చీర కట్టు పద్దతులు కలవు. కొన్ని పద్దతులు ప్రాదేశికములు, మరి కొన్ని కుల పద్దతలు. రాజా రవి వర్మచే రచించబడిన సరస్వతీ దేవి మరియు లక్ష్మీ దేవి చిత్రములు బహు ప్రసిద్దము. ఈ లక్ష్మీ దేవి చిత్రము లితోగ్రాఫ్ లుగా ముద్రణ పొంది బహు ప్రాచుర్యము పొందినవి. 1980ల వరకూ కూడా ప్రతి ఒక్కరి ఇంటిలో రవి వర్మ చిత్ర పటములు ఇంటిలో ప్రముఖముగా కనిపించేటట్లు పెట్టుకునేవారు. ఈ పటములలో లక్ష్మీ దేవి చీర కట్టు తీరును మహిళలు అనుకరించారు. తరువాతి శతాబ్దమునకు కూడా చీర కట్టు తీరును ఈ రకముగా రవి వర్మ చిత్ర పటములు నిర్దేశించినవి. ప్రతి ఒక్కరూ, ఒక గౌరమైన మహిళ ఇలా ఉండాలని నమ్మారు. "చీర కడితే అమ్మాయి సాక్షాత్తు లక్ష్మీ దేవి లాగా ఉంది" అనే మాట కూడా వాడుకలోకి వచ్చింది. ఈ చీర కట్టులో చీర రంగులూ, నేత మరియూ జరీ అందాలను ప్రదర్శించటానికి కూడా అవకాశము ఎక్కువ. ఈ చీర కట్టు "వనితల అంగ సౌష్టవాన్ని పెంచుతుంది, అంగలోపాన్ని కప్పుతుంది" అనే నానుడి కూడా మొదల్లయ్యింది.

రాజా రవి వర్మ సరస్వతీ దేవిని శాస్త్రీయముగా ఆసీనమైన పద్దతినుండి కూడా విముక్తి చేసారు. నాట్య శాస్త్ర ప్రకారము దేవి లలితాసనము కూర్చుండ పెట్టిన దేవాలయ ప్రతిమలని అనుకరించక, ఆవిడను ఇంకొక విశ్రాంత పద్దతిలో కూర్చుండపెట్టారు.

రవి వర్మ పటములోని సరస్వతీ దేవి వీణ పట్టుకునే పద్దతి గురించి కొంత చర్చ ఉండవచ్చు. రవి వర్మ ఉత్తర భారత దేశ పర్యటనలో సితార్ వాయిద్యకారిణి భంగిమలో కాదంబరిని చిత్రీకరించి ఉండవచ్చు. తరువాత సరస్వతీ దేవిని చిత్రీకరించి ఉండవచ్చు. ఈ పటము వలనే, వీణను సరస్వతీ వీణగా పిలువబడుతున్నదేమో? శ్రీమతి వింజమూరి అనసూయగరు పరిచయము అవ్వటము వలన కొన్ని విషయములు తెలిసినవి. ఆవిడ 1920లలోని మొదటగా విన్న వీణ కచ్చేరీలో ప్రముఖ వైణికుడు, పిఠాపురం ఆస్తాన వైణికుడూ, శ్రీ సంఘమేశ్వర శాస్త్రిగారు వీణను నిలువుగా పెట్టి వాయించారని చెప్పారు. కాబట్టి, వేరే రకముగా వీణ పట్టుకునే పద్దతులు కూడా ఉండవచ్చు. సరోద్, సితార్లు  పట్టుకునే పద్దతీ కుడా ఇదే.

బాపూగారికి రవి వర్మ అంటే గౌరవము. బహుశా వారి ఇంటిలోనో, వారి మిత్రుల ఇంటిలోనో రవి వర్మ చిత్రించిన సరస్వతీ లితోగ్రాఫ్ పటము కట్టి, రోజూ కనిపిస్తూ ఉండవచ్చు. బాపూగారికి ఆలవోకగా బొమ్మలు వేయటము అలవాటు అని కూడా ప్రతీతి. వారి వదినగారు కూర్చుని ఉత్తరము వ్రాసేటప్పుడు “లిఖిత” బొమ్మ వేసారని విన్నాను. బాపూగారు సర్స్వతీ బొమ్మను తరువాత చిత్రీకరించి ఉండవచ్చు. రవి వర్మ చిత్రానికి, ఈ చిత్రానికి ఉన్న ముఖ్యమైన తేడా, కొంచెముగా తల పక్కకి వంచటము. ఈ కొంచెం తేడాతో, చిత్రానికి ఇంకా అందము వచ్చింది. ఆవిడకు సుఖమూ, సాంత్వనమూ కలిగనట్టు అగుపిస్తున్నది. ఆయన చిత్రములలో స్త్రీలు ఎప్పుడూ అలవోకగా కొంచెం తల తిప్పి లేక వంచి ఉంటారు.

ప్రాచీన కాలమునకు చెందిన వివిధ సరస్వతీ దేవి విగ్రహములు కాలగమనాన్ని తట్టుకుని, నేటికీ మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నాయి. సరస్వతీ దేవి చేతులలో పుస్తకము, మాల, కమండలము (విద్యా వాహిని), వరదాన హస్తము (వరదా ప్రియ) లేక వీణ కలిగి ఉంటాయి. హంస లేక మయూర వాహనములు ఉంటాయి. సరస్వతీ దేవి ఎప్పుడు ప్రసన్న వదనముతో, కనికరం కలిగిన కను చూపుతో ఉంటుంది.

సరస్వతీ దేవి విగ్రహాన్ని ప్రాచీన కాలమునకు చెందిన మహా శిల్పులు చెక్కినారు. వారి పేర్లు వివరాలు మనకు తెలియవు. కానీ వారి నైపుణ్యంతో కూడిన సరస్వతీ దేవి మనకు దర్శన భాగ్యం కలిగిస్తున్నది. ప్రాచీన శిల్పులు వారి కాలము, నాటి దేశ, మత ఆచారాలకు అణుగుణముగా సరస్వతీ దేవి విగ్రహాన్ని తీర్చి దిద్దారు. ప్రతి శిల్పి సరస్వతీ దేవి విగ్రహము చెక్కడములో సరికొత్త భంగిమలకు తమ నైపుణ్యం జోడించారు.

మనకు తెలిసిన సరస్వతీ దేవి రూపము రవి వర్మదే. ప్రాచీన కాలమునాటి శిల్పుల వలనే, ఆయన కొత్త భంగిమలో సరస్వతీ దేవిని రూపొందించారు. అందుకు ఆయనకెన్నో కృతజ్ఞతలు.

The earliest available complete Saraswati sculpture is currently at Walter’s museum, Baltimore. It belongs to 10th or 11th century AD, but the Indian origin of the statue is unknown. The seated position of this statue is called “Lalitasana” and is in accordance with Barata’s Natya Sastra, an ancinet Indian treatise on performing arts (2nd century BC). Lalitasana is a relaxed but elegant pose. The veena in her hands is probably an Ektara, or a one stringed instrument. Other sculptures of Lakshmi and Parvati from the 10th or 11th century also have the same seated posture.

Raja Ravi Verma’s paintiings have an original artistic quality. Consciously or unconsciously, he experimented the postures and the way a saree is draped on a lady. In the 19th century India, there were numerous styles of draping a saree. Some of the styles were regional and some were related to caste or profession. Raja Ravi Verma’s depiction of Goddess Sarasawati and Goddess Lakshmi were reprinted as lithographs. These lithographs were extremely popular. Even until the 1980s, every household had a framed Lakshmi painting lithograph from Raja Ravi Verma. The way Lakshmi draped her saree in Ravi Verma’s painting set the fashion trend for next century. Everyone believed, this is how a respectable woman should dress. This is also the possible origin of the phrase, “Look at the way this young girl draped her saree, it is as if Goddess Lakshmi presented herself”! It is fashionable too, with multiple opportunities to display the glorious colors, weave patterns and embroidery. A comment about this style of saree draping is “it enhances the elegance of the woman, but hides any inelegance”.

Raja Ravi Verma also liberated Saraswati from the more formal seating posture  (half padmasana, with Vina across her lap). This is a more relaxing posture, a natural posture. Ravi Verma’s paintings have a perfect sense of “Natya Sastra”, many dancers can learn the perfect posture by studying his paintings (Like the statues and carvings on ancient temples).

Here, it can be debated that the holding the Veena is not accurate. Ravi Varma in his travels to North India might have portrayed a Sitar player in his “Kadambari”. Later, he retained the seating style for Saraswati, but changed the Sitar to Vina. It is quite possible that the name “Saraswati Vina” became popular only after Ravi Varma’s paintings became popular.  Recently, I had the opportunity to meet Vinjamuri Anasuya garu, a nanogenerian, an accomplished singer. She mentioned that, during the 1920s, she had the opportunity to be in a concert of a very famous Vina artist Sanghamesvara Sastri garu, from the Pithapuram Royal Court. She said, Sanghamesvara Sastri garu played the Veena holding it straight up. So, it is possible that there are quite a few styles of holding the Veena. Moreover, Sarod, Sitar are also held in this style.

Bapu had high regard for Raja Ravi Verma. It is quite possible that a framed lithograph of this painting was in his house or in one of the houses he frequented. Bapu had a habit of sketching anything that is in front of him. It is rumored that the lady in the “Likhita (writer)” portrait is his sister-in-law (elder brothers wife). He happened to see her in this natural pose, writing a letter. He sketched her. The only difference from Ravi Verma’s depiction is that the lady had a tilted head. This minor change enhanced the natural posture and gave it a sense of comfort and joy. The Saraswati sketch by Bapu might have come latter. In all Bapu’s paintings, the head and neck are never stiff, they have a gentle tilt (especially women) and exude a sense of joy.

There are several sculptures of Saraswati that survived the test of time. In these sculptures Saraswati is always depicted with a book, a mala or rosary, a kamandala (to pour water or knowledge), varada (varadapriya) or with a Vina. Saraswati is always portrayed as serene and benevolent. She is also recognized by her mounts (vahana) a swan or a peacock.

Saraswati Devi’s image was sculpted in several poses through the millennia by some of the greatest sculptors. We do not know their names, but their art persisted. These sculptors presented Saraswati according to the norms of their time and religion.   by Each of the sculptors portrayed Saraswati in a different posture, a transition from the previous generation.

The Saraswati image that we know is from Ravi Verma and to a certain extent from Bapu. Just like the various sculptors through the millenia, Ravi Verma interpreted and depicted Saraswati in a different way. And we are very thankful to him.

 

తరువాయి భాగం »

 

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

సోమరితనం అనేది ఒక రాచవ్యాధి. ఒకసారి అది సోకిందంటే, యింక ఆ రోగి ఎన్నటికీ బాగుపడలేడు – ప్రేంచంద్