Hasyam

‘నవ్వడం ఒక భోగం ... నవ్వించడం ఒక యోగం ... నవ్వలేక పోవడం ఒక రోగం’

ఈ సూక్తి మనందరికీ తెలిసినదే. మనిషి ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో జీవించాలంటే ఆత్మసంతృప్తి, అనురాగపూరిత కుటుంబం, హాస్యపూరిత వాతావరణం ఎంతో ముఖ్యం. ఆ అంశాన్ని దృష్టిలో వుంచుకొని మన సిరిమల్లె పాఠకుల కొరకు ఒక హాస్యవల్లరి శీర్షికను ప్రారంభిస్తున్నాం. ఇందులో కొత్త, పాత జోకులు మిళితమై వుంటాయి. మీరు వ్రాసిన, సేకరించిన, మీకు నచ్చిన జోకులను మాకు పంపితే ప్రచురిస్తాం. తప్పక పంపగలరు. పదిమందికి మీ నవ్వును అందించగలరు.

==========

 

బిచ్చగాడుః  సార్, మొదట్లో ఎదురుపడినప్పుడల్లా 25 రూపాయలు ఇచ్చేవారు. ఆ తరువాత దాన్ని 20 రూపాయలు చేశారు. కొంతకాలానికి అది 15 అయ్యింది. ఇప్పుడు 10 మాత్రమే ఇస్తున్నారు. ఎందుకు సార్?

వ్యక్తిః అదా? మొదట్లో నేను బ్రహ్మచారిని. అందుకే నీకు 25 రూపాయలు ఇచ్చేవాణ్ణి. తరువాత పెళ్ళైంది. అందుకే దాన్ని 20 చేశాను. కొంతకాలానికి మొదటి సంతానం కలిగింది. అప్పుడు 15 ఇచ్చేవాణ్ణి. ఇప్పుడు నాకు ఇద్దరు సంతానం. అందుకే పది రూపాయలే ఇస్తున్నా.

బిచ్చగాడుః చాలా బాగుంది సార్. ఐతే మీ ఫేమిలీ ఫేమిలీ మొత్తం నా డబ్బుల్తో బతికేస్తున్నారన్న మాట.

 

 

ఒక సర్దాజీ కంప్యూటర్ ఉద్యోగ ఇంటర్వ్యూకి వెళ్ళాడు.

ఇంటర్వ్యూ చేసే అతను “నీకు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ తెలుసా?” అని ప్రశ్నించాడు.

అందుకు జవాబుగా మన సర్దాజీ “అది సర్ఫ్ ఎక్సెల్ కి వేరే రూపం. దానిని కంప్యూటర్ శుభ్రం చేసేందుకు వాడతారు” అని బదులిచ్చాడు.

 

 

*A to Z నిరుద్యోగి వ్యధ*

*A*మని చెప్పను నా వ్యధ. అదో *B*కారి గాధ. చెప్పడానికీ *C*గ్గు పడుతున్నా. *D*గ్రీ , పీజీలున్నా నాకు ఉద్యోగం సున్నా, *E* సమస్యపై సైనికుడిలా *F*క్టీవ్ గా పోరాడుతూనే ఉన్నా. ప్చ్, అయినా *G*వితంలో స్థిర పడలేక పోతున్నా, ఇవన్నీ వద్దు సొంతకాళ్ళపై నిలబడమని నాన్న ఎప్పుడో H*చ్చరించారు. *I*నా నేను మారలేదు. అదే నా పొరపాటు. నా చదువుకు నాన్న *J*బులు ఖాళీ అయ్యాయ్. *K*జీల కొద్ది పుస్తకాలు చదివితేనే *L*కేజీలు, పీజీలు పూర్తయ్యాయ్. ఇప్పుడు *M*ల్యేలు, ఎంపీల చుట్టూ తిరిగినా *N*న్నికయ్యాక  చుద్దాం అంటున్నారే గానీ *O*క్కరైనా కనికరించరే? *P*చ్చివాడిలా అన్ని ప్రయత్నాలు చేశా. *Q*లో నిల్చొని కొలువు కలలు కన్నా, *R*ళ్ళుగా చెప్పులరిగేలా తిరుగుతూనే ఉన్నా. ఆఖరికి *S*..నేను మారాలి అని వేరే ప్రయత్నాలు మొదలు పెట్టినా అక్కడా తీవ్ర పో*T*. U*ద్ధం లాంటి పరిస్థితి. జీవితంపై *V*రక్తి పుట్టి ఆసుపత్రి కెళ్తే *X* రే తీసి *Y*ద్యులు నీకు "నిరుద్యోగం" జబ్బు సోకిందని *Z*డ్జిమెంట్ ఇచ్చేశారు.

 

divider

 

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

నిరాశ చెందకుండా మనిషి ప్రయత్నిస్తూ పోవాలే గాని, ఏదో ఒక రోజున సర్వసుఖాలు వరించి తీరుతాయి – థామస్ జె వాట్సన్ (సీనియర్)