సామెతల ఆమెతలు
- సమీకరించినది: వెంపటి హేమ (కలికి)

గత సంచిక తరువాయి »

గత రెండు సంచికలలో సామెతల గురించిన ఉపోద్ఘాతము మరియు విశ్లేషణ అందించాను. ఒకటా, రెండా, వేలకొలది సామెతలు మన తెలుగు భాషలో, జనజీవన స్రవంతిలో నుండి పుట్టి ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొన్నాయి. ఇక ఇప్పుడు నేను సమీకరించిన సామెతల వెల్లువను మీకు అందిస్తున్నాను.

౧. జగమెరిగిన బ్రాహ్మణునికి జందెమెందుకు?
౨. అచట పుట్టిన చిగురుకొమ్మైనా చేవ!
౩. మొదట పుట్టిన చెవులకన్నాతరువాత వచ్చిన కొమ్ములు వాడి!
౪. చల్లకోసం వచ్చి ముంత దాచడం ఎందుకు!
౫. పిచ్చుకపైన  బ్రహ్మాస్త్రమా?
౬. తాడిచెట్టు ఎక్కా వెందుకురా - సామెతల అంటే, దూడ గడ్డికోసం - అన్నట్లు ...
౭. కామెర్ల రోగికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది!
౮. మర్చిపోయి మజ్జిగలో చల్ల పోశానన్నట్లు ...
౯. కాకిలా కలకాలం బ్రతికే కంటే, హంసలా ఆరు నెలలు బ్రతికినా చాలు!
౧౦.  బూడిదలో పన్నీరు ఎంత పోసినా ఒకటే!
౧౧. తన నీడను చూసి, తానె భయపడినట్లు ...
౧౨. ఎద్దుకేం తెలుస్తుంది అటుకుల రుచి?
౧౩. నువ్వు నీ ఎడం చెయ్యి తియ్యి, నేను నా పుర్రచెయ్యి పెడతాను - అన్నట్లు !
౧౪. చెట్టు మీది రెండు పిట్టలుకన్నా చేతిలోని ఒక్క పిట్ట మేలు!
౧౫. తనకు కాని విషయంలో తలదూరిస్తే తన్నులు తినక తప్పదు!
౧౬. కానిమాట కప్పెట్టుకోవాలి!
౧౭ . మాంసం తిన్నా, ఎముకలు ఎవరూ మెడకు కట్టుకోరు!
౧౮. ఎడ్డెం అంటే తెడ్డెం అన్నట్లుగా ...
౧౯. రెడ్డొచ్చె మొదలాడు - అన్నట్లుగా ...
౨౦. నంది నందే - పంది పందే!
౨౧. చేసుకున్నమ్మకు చేసుకున్నంత మహాదేవా - అన్నట్లు ...
౨౨. ఇంగువ కట్టిన గుడ్డకు ఎంతకీ వాసన పోదు!
౨౩. పిల్లి కళ్ళుమూసుకుని పాలు త్రాగుతూ తను ఎవరికీ కనిపించడం లేదు - అనుకుంటుoదిట! 
౨౪. అట్టుకి చిన్న, ముక్కకి పెద్ద....
౨౫. నిలకడలేని మాట - నీటిపైన రాత!
౨౬. నలుగురితో నారాయణా,  కులంతోపాటు గోవిందా!
౨౭. నీరు పల్లమెరుగు, నిజము దేవు డెరుగు!
౨౮.నిదానమే ప్రధానం!
౨౯. అబద్ధపు పెళ్ళికి అదనపు దరువుట!
౩౦. నిలకడమీద నిజం బయటికిరాక తప్పదు!

 

.....సశేషం.....

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

నిరాశ చెందకుండా మనిషి ప్రయత్నిస్తూ పోవాలే గాని, ఏదో ఒక రోజున సర్వసుఖాలు వరించి తీరుతాయి – థామస్ జె వాట్సన్ (సీనియర్)