గణిత మేధావి వశిష్ట నారాయణ్ సింగ్

vnsinghఅన్ని జన్మలలో కెల్లా మానవజన్మ అత్యుత్తమమైనది. కారణం, 5 అడుగుల మనిషి తన కన్నా ఎన్నో రెట్లు పెద్దవైన, బలమైన జీవరాశులను తన మేధాసంపత్తితో నియంత్రించి తన చెప్పుచేతల్లో ఉండేటట్లు చేస్తున్నాడు. మనిషి మెదడుకు అంత శక్తి ఉన్నది. మరి ఆ మెదడులో ఎన్నో అనిర్వచనీయమైన ఆలోచనలు సదా పుడుతూనే ఉంటాయి. అయితే ఆ ఆలోచనలను కట్టడిచేసే సామర్ధ్యము ఉండి మన మెదడుకు సరైన పాళ్ళలో రసాయన ప్రక్రియ జరిగి సక్రమమైన రక్తప్రసరణ జరిగినప్పుడే మనం ఎటువంటి మానసిక రుగ్మతలకు లోనుకాము. అయితే నేటి కాలంలో మనుషులు విపరీతమైన మానసిక ఒత్తిడికి బలౌతూ ఎన్నో మానసిక ఇబ్బందులను తద్వారా శారీరక అసౌకర్యాన్ని పొందుతున్నారు. అందుకు ఉదాహరణనే మన గణిత శాస్త్రవేత్త వశిష్ట నారాయణ్ సింగ్.

vnsinghఆచార్య నారాయణ్ సింగ్ బాల్యం నుండే అపరమేధావి. ఎన్నో సరికొత్త గణిత సిద్దాంతాలను రూపకల్పన చేసి అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఎంతో మంది విద్యార్థులకు గురువుగా చక్కటి జీవిత మార్గాన్ని చూపించారు. అయితే దురదృష్టవశాత్తూ స్క్రిజోపీనియా అనే మానసిక జబ్బుకు బలై తన ఉనికిని మరిచిపోయి, సాధారణ జీవన శైలిని కోల్పోయారు. ఈ జబ్బు ఉన్న వారు తమను తామే ఎన్నో విధాలుగా ఊహించుకుంటూ తమదైన లోకంలో ఉంటారు. వారి ఆలోచనల విధానం ఒకే విధంగా ఉండదు. ఈ జబ్బుకు మందు లేదు. ప్రపంచం మొత్తం మీద ఎన్నో లక్షల మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు ముఖ్యంగా మేధావులు.

మన నారాయణ్ సింగ్ కూడా ఆ మానసిక అస్తవ్యస్తంతో ఇల్లువదలి ఏటో వెళ్ళిపోయారు. చివరికి చిరిగిన దుస్తుల్లో, మాసిన గడ్డంతో అత్యంత దయనీయ పరిస్థితుల్లో బీహార్ లోని శివాన్ లో కనిపించారు. ఆయనను గుర్తుపట్టిన వారిలో ఆయన శిష్యులే ఉన్నందున వారు ఆయనకు ఒక ప్రత్యేక ఇంటిని ఏర్పాటు చేసి, అన్నీ వసతులను కల్పించి ఆయనను జాగ్రత్తగా చూసుకొంటున్నారు.  అది ఆయన చేసిన నిస్వార్ధ విద్యాసేవకు ప్రతిఫలం అనుకోవచ్చు. కానీ అలాంటి అదృష్టం అందరికీ కలగదు. ఈ స్క్రిజోపీనియా జబ్బుకు బలైన ఎంతో మంది మేధావులు ప్రపంచం మొత్తం మీద వేలల్లో ఉన్నారు. భవిష్యత్తులో ఈ జబ్బుకు మందు కనిపెడతారేమో చూద్దాం.

 

divider

 

Source: Source1, Source2, Source3

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

నిరాశ చెందకుండా మనిషి ప్రయత్నిస్తూ పోవాలే గాని, ఏదో ఒక రోజున సర్వసుఖాలు వరించి తీరుతాయి – థామస్ జె వాట్సన్ (సీనియర్)