మన ఆలయాలు, మన సంస్కృతి పరిరక్షక పవిత్ర ప్రామాణికాలు

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, బర్మింగ్హాం, యునైటెడ్ కింగ్డమ్

Temple


మన భారతదేశాన్ని ఆంగ్లేయులు దాదాపు 90 సంవత్సరాలు (1858-1947) పరిపాలించారు. తద్వారా ఇరువైపులా సాంస్కృతిక, సామాజిక వినిమయం అంటే మార్పిడి కూడా చోటుచేసుకున్నది. మన హిందూ మతం లోని అత్యంత విలువైన సనాతన ధర్మాలను, వేదాలను ఆంగ్లేయులు ఎంతో నిష్ఠతో అవగాహన చేసుకొన్నారు. మనలో కూడా ఎంతో మంది క్రైస్తవ ధర్మాలను ఆచరించడం మొదలుపెట్టారు. మనకు స్వాతంత్ర్యము సిద్ధించిన తరువాత ఎంతో మంది భారతీయలు ముఖ్యంగా దక్షిణ భారతం నుండి ఇంగ్లాండ్ కు వలస వెళ్ళారు. అయితే మన హైందవ ధర్మాలను ఆచరించడం కొంచెం కష్టమనిపించినా అవకాశం కొఱకు వేచియుండి చిన్న చిన్న ప్రార్థనా స్థలాలు ఏర్పాటు చేసుకొని పూజలు చేయడం మొదలుపెట్టారు.  అలా సమిష్టిగా బర్మింగ్హాం ప్రాంతంలో మొదలుపెట్టిన ఆ కృషి చివరకు ఐరోపా ఖండం లోనే అత్యంత పెద్దదైన వెంకటేశ్వర స్వామి ఆలయంగా ఆగష్టు 2006 సంవత్సరంలో వెలసింది. తిరుమల దేవస్థానం స్ఫూర్తితో ఈ ఆలయ నిర్మాణం అదే ఆకృతిలో కట్టడం జరిగింది.

temple


సాధారణంగా భారతదేశం వెలుపల నిర్మించే హిందూ దేవాలయాలలో దేవతామూర్తులు అందరూ కొలువుతీరి ఉంటారు. పేరుకి వెంకటేశ్వర స్వామి ఆలయం అయినను, ఈ ప్రాంగణంలోనే ఆదిశంకరుడు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, లక్ష్మీ దేవి మరియు ఆంజనేయస్వామి కోవెలలు కూడా ఉన్నాయి. ఇక గ్రహస్థితిని చక్కగా ఉంచేందుకు అనువుగా నవగ్రహ ప్రతిష్ఠ కూడా జరిగింది. ఎంతో పొందికగా విశాలమైన స్థలంలో చక్కటి వాస్తుతో నిర్మించిన ఈ ఆలయ ప్రాంగణం నిజంగా యునైటెడ్ కింగ్డమ్ లో ఉన్న భారతీయులకు ముఖ్యంగా హిందువులకు నిజంగా అదృష్టం. 12 అడుగుల ఆ ఆజానుబాహుడు, కోనేటిరాయుని దర్శనభాగ్యం కలగడం ఒక వరం.

temple


రెండు అంతస్తులతో నిర్మించిన ఈ ఆలయం పై అంతస్తులో దేవతామూర్తులు కొలువై ఉండగా, క్రింది అంతస్తులో వేదాలు, సంస్కృత భాషను బోధించే తరగతులు, భోజనశాల, అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే వేదిక  ఉంటాయి. వ్రతాలు, హోమాలు, నామకరణం తదితర ముఖ్యమైన సాంప్రదాయ ఉత్సవాలన్నీ సదా జరుగుతుంటాయి.

ఈ ఆలయం చేరుకోవడానికి డుడ్లేయ్, బర్మింగ్హాం నగరాల నుండి బస్సు సౌకర్యం కూడా ఉంది.

temple


temple


 

divider

 

Source1, Source2, Source3, Source4

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

దానగుణం సమస్తగుణాలకు అవధిలాంటిది – చాణక్య సూత్రం