Ankurarpana


గత సంచిక తరువాయి »

అంతర్జాలం

ఇది ఒక మాయాజాలం..నేడు దీనికి అందరూ బానిసలయిపోతున్నారు. అవసరార్ధ వాడకము తప్పు లేదు..కానీ అవసరానికి మించి వాడితేనే ముప్పు వాటిల్లితుంది. చిన్న వాళ్ళ నుండి ముసలి వాళ్ళ వరకు..ప్రతి ఒక్కరి చేతిలో నేడు సెల్ ఫోన్ ధర్శన మిస్తున్నది. టాబ్లెట్ ..ఐఫోన్లు..మొబైల్ ఫోన్లు..ల్యాప్టాప్లు ఇలా ఒకటేమిటి అన్నింటికీ వినియోగము ఎక్కువైపోయింది నేడు. ఒకప్పుడు మొబైల్ ఉంటే గొప్పగా చెప్పుకునేవారు. కానీ నేడు స్మార్ట్ ఫోన్ లేదంటే అవమానిస్తున్నారు. అవమానముగా భావిస్తున్నారు. పరిస్థితి అలా మారిపోయింది. ఉచిత కనెక్షన్లు...ఉచిత డేటాలు ఎరచూపి మిగిలిన ఆ కాస్త జనాన్ని కూడా అంతర్జాలానికి బానిసలను చేశాయి కొన్ని కంపెనీలు. పిల్లలు మొబైల్ లలో ఎంతో ఏకాగ్రతతో ఆటలు ఆడేస్తూ దృష్టి లోపాలను కొని తెచ్చుకుంటున్నారు. చదువులపై..బయట ఆటలపై అనాసక్తిని చూపిస్తున్నారు. అరె చిన్న పిల్లవాడు మొబైల్ చేతికిస్తేనే అన్నం తింటున్నాడు. మొన్న మా బంధువుల వాళ్ళింటికి వెళ్ళినపుడు. ఆ పిల్లవాడి వయస్సు నాలుగేండ్లు...వాడు యు ట్యూబు బ్రౌజ్ చేస్తున్నాడు. అందులో ఉండే అసభ్యకర చిత్రాలను తిలకిస్తున్నాడు వాడికి తెలియకుండానే. ఇందులో తప్పు ఎవరిది..? ఇంకో ఇంటిలో అర్థరాత్రయినా అబ్బాయి వైఫై వాడుతున్నాడు. అదేమిటని అడిగితే.. అబ్బాయే కదా! భయమెందుకు.. అంటున్నారు. ఏమి అబ్బాయి మాత్రం చెడిపోడా..? మన ఆలోచనలలో ఎంత వ్యత్యాసం!.. ఎటుపోతున్నది మన సమాజం.. ఒక ప్రక్క అన్ని విషయాలలో ఎంతో పురోగతిని సాధిస్తూ.. ఇంకో ప్రక్క ఇలా వెనక పడిపోతున్నాము.. చిన్న పిల్లలనే కాదు.. పెద్దవాళ్ళు కూడా ఈ వాట్స్ ఆప్, ఫేస్ బుక్ ల వలన ఇబ్బందులు పడుతున్నారు.. భార్యా భర్తల మధ్య అనురాగం కరువయిపోతున్నది.. కుటుంభ సభ్యుల మధ్య మమకారాలు దూరమయిపోతున్నాయి.. ఎందుకు జరుగుతుంది ఇలా?? ఎందుకంటే నేటి జీవన విధానము యాంత్రికమైపోయింది.. తల్లితండ్రులు వాళ్ళ ఉరుకుల పరుగుల పయనములో తమ పిల్లలతో గడిపే సమయాన్ని తగ్గించేశారు... ఇద్దరి పిల్లల స్థానాన ఒక్కరినే కంటున్నారు.. ఇంక వాళ్ళ మనసులో మాటలను పంచుకోవడానికి ఎవరూ లేక అందుబాటులో ఉన్న అంతర్జాలానికి బానిసలయిపోతున్నారు.. మరి ఏమీ చేయాలేమా! ఎందుకు చేయలేము! చిన్న చిన్న మార్పులు చేస్తే తప్పకుండా సాధ్యమవుతుంది. పిల్లలు అంతర్జాలాన్ని మన సమక్షములో వాడేటట్లు చూసుకోవాలి. రాత్రి పూట మొబైల్ ఫోన్లను వాళ్ళ వద్ద ఉంచకూడదు.. అలాగే భోజనము చేసేటప్పుడు కుటుంబంలో అందరూ కలిసి డైనింగ్ టేబుల్ వద్ద.. మొబైల్ ఫోన్లను దూరముగా పెట్టి పిల్లలతో మాట్లాడుతూ తిందాము. అప్పుడు వాళ్ళు ఒంటరి తనము భావించకుండా మనసులో ఉన్నవి మనతో చెప్పుకుంటారు. మనము కూడా అవసరానికి మించి మొబైల్ వాడకము తగ్గిస్తే అందరితో గడిపే సమయము లభిస్తుంది. దీనికి అంకురార్పణ మనమే చేయాలి. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురుచూడకూడదు.

 

తరువాయి భాగం »

 

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

దానగుణం సమస్తగుణాలకు అవధిలాంటిది – చాణక్య సూత్రం