Hasyam

‘నవ్వడం ఒక భోగం ... నవ్వించడం ఒక యోగం ... నవ్వలేక పోవడం ఒక రోగం’

ఈ సూక్తి మనందరికీ తెలిసినదే. మనిషి ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో జీవించాలంటే ఆత్మసంతృప్తి, అనురాగపూరిత కుటుంబం, హాస్యపూరిత వాతావరణం ఎంతో ముఖ్యం. ఆ అంశాన్ని దృష్టిలో వుంచుకొని మన సిరిమల్లె పాఠకుల కొరకు ఒక హాస్యవల్లరి శీర్షికను ప్రారంభిస్తున్నాం. ఇందులో కొత్త, పాత జోకులు మిళితమై వుంటాయి. మీరు వ్రాసిన, సేకరించిన, మీకు నచ్చిన జోకులను మాకు పంపితే ప్రచురిస్తాం. తప్పక పంపగలరు. పదిమందికి మీ నవ్వును అందించగలరు.

divider

 

డాక్టర్: ఏంటి నీ జబ్బు?

పేషెంట్: నిద్ర ఎక్కువగా వస్తోంది ఎప్పుడూ నిద్ర పోతూనే వుండాలనిపిస్తున్నది

డాక్టర్: ఏ మొబైల్ వాడుతున్నారు?

పేషెంట్: నోకియా 1100

డాక్టర్: ఒక స్మార్ట్ ఫోన్ రాసి ఇస్తాను.. దాంట్లో ఒక BSNL 429 plan  సిమ్ వేసి ఫేస్ బుక్ , వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకోండి.. అంతా నయం అయిపోతుంది..

 

 

ఒక డాక్టర్ కి ఉద్యోగం దొరక్క ఒక క్లినిక్ మొదలు పెట్టాడు. జనాల్ని attract చెయ్యడానికి బయట ఈ విధంగా బోర్డ్ పెట్టాడు.

“ట్రీట్ మెంట్ ఫీజు 300రూ, బాగవ్వకపోతే 1000రూ వాపస్ ఇవ్వబడును”

ఒక పేషెంట్ ఈ బోర్డు చూసి తనకు 1000 రూపాయలు సంపాదించే అవకాశం వచ్చిందని సంబరపడుతూ ఆ క్లినిక్ లోకి వెళ్ళాడు.

పేషేంట్:- డాక్టర్ గారు నా నాలుక రుచి కోల్పోయింది.

డాక్టర్:- నర్స్ బాక్స్ No-22 లో ఉన్న మందు తీసుకొచ్చి మూడు చుక్కలు పేషంట్ నోట్లో వెయ్.
పేషంట్:- చీ ఇది పెట్రోల్ కదా డాక్టర్,

డాక్టర్:- కంగ్రాట్స్ నీ నాలుకకు రుచి తెలుస్తుంది. 300రూ ఫీజు ఇచ్చి వెళ్ళండి.

పేషెంట్ కి కోపం వచ్చింది. 300రూ ఫీజు ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

కొన్నిరోజులకి తను పోగొట్టుకున్న డబ్బులు తిరిగి సంపాదించుకుందామని మళ్ళీ వెళ్ళాడు.

ఈ సారి పేషెంట్:-  డాక్టర్ ఈ మద్య నాకు ఏదీ గుర్తుండటంలేదు.

డాక్టర్:- నర్స్ బాక్స్ no-22 లో ఉన్న మందు తీసుకొచ్చి మూడు చుక్కలు పేషంట్ నోట్లో వెయ్యి.

పేషెంట్:- డాక్టర్ అది నాలుకకి రుచి తెప్పించే మందు కదా???

డాక్టర్:- కంగ్రాట్స్ నీ మతిమరుపు పోయింది. 300రూ ఫీజు ఇచ్చి కదులు.

పేషెంట్ కి మరింత కోపం పట్టుదల పెరిగి కొన్ని రోజుల తరువాత మళ్ళీ వచ్చాడు.

పేషెంట్:- డాక్టర్ నా కళ్ళు ఈ మద్య సరిగా కనపడటం లేదు

డాక్టర్:- ఓ అట్లాగా! నా దగ్గర దీనికి మందు లేదు. ఈ 1000 రూపాయలు తీసుకో......

పేషెంట్:- కానీ ఇది 10 రూపాయల నోట్ కదా????

డాక్టర్:- వావ్ కంగ్రాట్స్ నీ చూపు తిరిగొచ్చింది. 300రూ ఫీజు ఇచ్చి కదులు.

 

 

భార్య భర్తలు గొడవ పడుతూ..

భర్త: నువ్వంటే నాకేమన్నా భయమనుకున్నావా?

(కోపంగా) భార్య: అబద్ధాలు చెప్పకండి..మీరు నన్ను చూడ్డానికి 5 మందితో వచ్చారు..తర్వాత తాంబూలానికి 50 మందితో వచ్చారు.. పెళ్లికి 200 మందితో వచ్చారు...మరి నేను మీఇoటికి ఒక్కదాన్నే వచ్చాను..(వెటకారంగా).

 

divider

 

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

దానగుణం సమస్తగుణాలకు అవధిలాంటిది – చాణక్య సూత్రం