కాజ్ వే బ్రిడ్జి (సేతువు) – లూసియానా రాష్ట్రం, యు.ఎస్.ఎ.

Causeway Bridge

ఇక్కడ, అమెరికాలో సాధారణంగా వరదలు వచ్చి నీరు పొంగిపొరలుతున్నప్పుడు ఆ నీటిని విశాలమైన మైదానాలలోకి వదిలేస్తారు. అపుడు ఆ నీరు భూమిలోకి ఇంకిపోయి ఆ ఒండ్రు నేలలు సారవంతమై పంటలు వేసేందుకు, భూగర్భంలో నీటిమట్టం పెరిగేందుకు ఎంతగానో దోహదపడుతుంది. అందుకే పెద్ద పెద్ద చెరువులు, కుంటలు, సరోవరాల చుట్టుప్రక్కల ఎంతో భూమిని ఈ ప్రక్రియకు వినియోగిస్తారు. అందుకనే నీరు వృధాగా సముద్రంలోకి పోదు.

అయితే ఈ మైదానాలు ఎల్లప్పుడూ తడిగా ఉండి, లేదా నీటితో మునిగి ఉంటాయి కనుక వాటిని దాటాలంటే ఖచ్చితంగా వంతెనను నిర్మించాలి దానినే ‘కాజ్వే’ అని ఆంగ్లంలో అంటారు. మన తెలుగులో ‘సేతువు’ లేదా ‘కట్ట’  అనవచ్చు. అయితే నీరు స్వేచ్ఛగా ప్రవహించే విధంగా ఈ కట్టలను నిర్మించడం ఇక్కడి విశేషం. అందుకు కాంక్రీట్ స్తంభాలతో వంతెనను నిర్మిస్తారు. అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో ఉన్న అటువంటి కాజ్ వే  గురించిన సమాచారమే నేటి టూకీగా...

సాధారణంగా ఇటువంటి కట్టలు 2 లేదా 3 మైళ్ళకు మించి నిర్మాణం జరగదు. కానీ ఈ కాజ్వే 24మైళ్ళ పొడవుతో ప్రపంచంలోనే అత్యంత అవిచ్ఛిన్నమైన వంతెనగా పేరుగాంచింది. ఇంకొక గొప్పవిషయం; ఈ సేతువును పొంచార్ ట్రైన్ అనే సరుస్సును ఉత్తర దక్షిణ దిశలలో దాటుటకు నిర్మించారు. 9500 కాంక్రీట్ స్తంభాలతో ఈ బ్రిడ్జి ని నిర్మించడం జరిగింది. మరొక్క ఆసక్తికర విషయం; సరస్సులో నౌకలు ప్రయాణించుటకు అనువుగా ఈ బ్రిడ్జి మధ్యలో పైకి లేస్తుంది. నౌక లేదా పడవ వెళ్ళిన తరువాత మరల సాధారణ స్థితికి వస్తుంది.  ఈ బ్రిడ్జిని నిర్మించి దాదాపు ఐదు దశాబ్దాలు అయింది. అయినా నేటికీ పటిష్టంగా ఎంతో ఉపయోగకరంగా ఉంది.

Causeway Bridge

 

divider

 

Source: Destination Trips

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

దానగుణం సమస్తగుణాలకు అవధిలాంటిది – చాణక్య సూత్రం