నోరూరించే రుచి

 

శ్రీమతి వెంపటి హేమ గారు అందిస్తున్న తెలుగింటి సంప్రదాయ వంటకాలలో భాగంగా వంకాయలతో చేయగల మరికొన్ని రుచికరమైన వంటలను గురించి తెలుసుకొందామా?

తెలుగింటి వంటకాలు

వంకాయను కాల్చి చేసీ వంటలు

వంకాయ, టమోటా పచ్చడి:

ఒక్కొక్కప్పుడు పుచ్చులు ఎక్కువగా ఉండడం వల్లో లేదా పెద్ద వంకాయలు దొరక్కపోవడమో జరిగి, కాల్చిన వంకాయ పచ్చడి చేసుకోడం పడకపోవచ్చు. అప్పుడు వంకాయల్ని ముక్కలుగా తరిగి నూనెలో మగ్గించి కూడా పచ్చడి చేసుకోవచ్చు. ఇక పావు కిలో వంకాయలు కొంచెం పెద్ద ముక్కలుగా తరిగి, గిన్నెలో 2 tsp నూనె వేసి మీడియం మంటమీద మగ్గించి, మగ్గి మెత్తబడ్డాక ఒక గిన్నెలోకి తీసి ఉంచాలి. ఇక పోపుని వంకాయ బండపచ్చడికి లాగే తయారు చేసి, దానిలో ఈ వేయించిన ముక్కలు వేసి, ఒక TbSp చింతపండు గుజ్జు ను వేసి తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసి నూరాలి. టమోటాల్లో పులుపు ఉంటుంది కనక చింతపండుని తగ్గించాలి. కొత్తిమీర మీ ఇష్టాన్నిబట్టి వేసుకోవచ్చు.

వంకాయ పెరుగుపచ్చడి:

రెండుకప్పుల పెరుగు ఒక గిన్నెలోకి తీసుకుని దానిలో 1 1/2 tsp ఉప్పు, సన్నగా తరిగిన మూడు పచ్చిమిరపకాయల ముక్కలు, చిన్న కొత్తిమీర కట్టను శుభ్రంచేసి కడిగి సన్నగా తరిగి ఆ పెరుగులో వెయ్యాలి. ఆపై రెండు ఎండు మిరపకాయల ముక్కలు, 1/2 tsp ఆవాలు, 1/2 మినప్పప్పు. చిటికెడు ఇంగువ  పోపు వేయించి పెరుగులో కలపాలి. ఇప్పుడు ముందుగానే చేసి ఉంచుకున్న వంకాయ గుజ్జును దీనిలో కలపాలి. అన్నివైపులా బాగా కలిసేలా కలిపి వడ్డించాలి.

వచ్చే సంచికలో బుంగ మిరపకాయల (కాప్సికం) తో చేయగల కొన్ని వంటలను గురించి తెలుసుకొందాము.

.... సశేషం ....

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

దానగుణం సమస్తగుణాలకు అవధిలాంటిది – చాణక్య సూత్రం