Ankurarpana


గత సంచిక తరువాయి »

మాదక ద్రవ్యాలు

మనుషుల మతులు పోగొట్టి...శరీర అవయవాలను కృశింపజేసి...ఎముకలను పిండి చేస్తూ ..రక్తాన్ని నీరుగార్చే ..వినాసిని ఈ మాదక ద్రవ్యం, నేడు యువతని పట్టిపీడిస్తున్న మహమ్మారి. ఈ మాదకద్రవ్యాల వ్యాపారం చివరకు సినీ పరిశ్రమలో కూడా ఒక భూకంపాన్ని తెచ్చింది...ఈ మత్తులో చిత్తవుతున్న వారెందరో..అభం శుభం తెలియని చిన్నారుల నుండి అన్నీ తెలిసిన నవతరం వరకు అందరూ మత్తుకు చిత్తవుతున్నారు...మరి దీనికి కారణమేమిటి...కారకులెవరు...?ఈ మత్తులోపడి మిగిలిన జీవితాన్ని అంధకారములోకి నెడుతూ ఎంతో విలువైన మానవ జీవితాన్ని చిత్తు చేసుకుంటున్నారు...దీనికి బాధ్యులెవరు?

ఒకరు లేక ఇద్దరు పిల్లలని కని...వాళ్ళని అతిగారాబముగా పెంచుతూ...అడిగినవన్నీ కాళ్ల దగ్గరకు తెచ్చిపెడుతూ.. అడిగినంత డబ్బులిస్తూ...ఆ డబ్బులు సంపాదించడానికి తల్లితండ్రులుగా రాత్రీ పగలు కష్టపడుతూ...పిల్లలు ఎలా పెరుగుతున్నారో పట్టించుకోకుండా...వాళ్ళ ఆలనా పాలనా  చూసే తీరిక లేక..అటు మంచిని భోదించే నాన్నమ్మ తాతయ్యలు వంటి పెద్దల సంరక్షణ కొరవడుతూ...మనసులో భావాల్ని పంచుకునే సన్నిహితులు లేక...ఈ వ్యసనానికి బలి అవుతున్నారు నేటి యువత...ప్రేమ రాహిత్యముతో కొంతమంది...చదువులలో పోటీతత్వాన్ని తట్టుకోలేక కొంత మంది...అంతర్జాల బెదిరింపులకి తలవగ్గి కొంతమంది...బెట్టింగులలో ధనమును పోగొట్టుకుని కొంతమంది...కొత్త రుచుల సరదా పందాలో కొంతమంది...మానసిక ఒత్తిడికి తట్టుకోలేక కొంత మంది...మనసు బలహీనమైన క్షణాన ఈ మాదక ద్రవ్యాలకు బానిసలైపోతున్నారు...ఈ మత్తులోకి దిగినవారందరూ...దీనికి బానిసలై బయటకు రాలేక...వాటిని కొనడానికి డబ్బులు లేక..అవిలేకపోతే ఉండలేక..తప్పుల మీద తప్పులు చేస్తూ...తమ జీవితాన్ని నాశనము చేసుకుంటున్నారు..

ఈ మత్తు నుండి బయటపడాలంటే...తల్లితండ్రులకు చాలా ఓపిక ఉండాలి...ఏ ప్రేమ రాహిత్యముతో వాళ్ళు దీనికి బానిసలయ్యారో ..ఆ ప్రేమనే మందుగా పెట్టి తమ బిడ్డలను మార్చుకోవాలి...జీవితపు విలువలను...మాధుర్యాన్ని వాళ్ళకి చవిచూపాలి. ఎంత పనుల ఒత్తిడి ఉన్నా పిల్లల స్కూల్ కి..కాలేజీలకి వెళ్ళి...అక్కడి వాతావరణాన్ని, పరిస్థితులను, గమనించి అధ్యాపకులతో పిల్లల గురించి చర్చించాలి...బంధాలు...అనుబంధాల విలువలను ఇప్పటి పిల్లలకు తెలియజెప్పాలి...దీనికి అంకురార్పణ మనమే చేయాలి...

 

(...సశేషం...)

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

దేశసేవ అంటే ఉపన్యాసాలు దంచడం కాదు – ఎవరి విధిని వారు సక్రమంగా నిర్వర్తించగలగడం. అదే అసలైన దేశసేవ – మహాత్మాగాంధీ