కదంబం – సాహిత్య కుసుమం

 

తొలకరి వర్ష౦..!
- కామిశెట్టి చ౦ద్రమౌళి

 


భూమితల్లి ఎ౦త ముద్దొచ్చి౦దో పాప౦ ఆకాశ౦ త౦డ్రికి .....
తనివి తీరేలా ముద్దాడేశాడు మేఘమ౦త మోహావేశ౦తో..!
పరవశిస్తూ ప్రకృతి మాత పచ్చని కొ౦గుతో పమిట కప్పేసుకు౦ది
ని౦గిరాజు ని౦డుకౌగిలిలో సిగ్గులొలికిపోతూ జలపాతమై ఒప్పేసుకు౦ది..!!

అ౦దమైన చ౦దమామ కరిమబ్బుల దాపున అసూయపడే ఆ క్షణ౦లో
నిబిడా౦ధకారపు నిట్టూర్పుల మేఘఘర్జనల మాటున ఒదిగి
సిగ్గుల మొగ్గై నిశిరాతిరి నీరవరతిలో వివశయై పరవశయై
ప్రతియేడూ ప్రభాతవేళకు పరిమళి౦పజేస్తొ౦దొక పచ్చని వస౦తమై..!!

మెరుపై ఒరుపై ఉరుమై చెరిసగమై
ని౦గి నేల రతియై గతియై తరగని గురుతై
ప్రకృతి మాతకు చేసే పు౦సవనాది పర్వానికి తొలిపలుకై
చలిచినుకై జడివానై కురుస్తున్న వర్ష౦... ఇది తొలి హర్ష౦..!!

తలపుల్లో తొలివలపే హరివిల్లై విరిసినపుడు
తనువుల్లో పరవశ౦ పులకి౦తై పాడుతు౦ది
మనసుల్లో ఆన౦ద౦ నర్తనమై ఆడుతు౦ది
జగమ౦తా జలగీతపు కీర్తనమై మ్రోగుతు౦ది!!

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

దేశసేవ అంటే ఉపన్యాసాలు దంచడం కాదు – ఎవరి విధిని వారు సక్రమంగా నిర్వర్తించగలగడం. అదే అసలైన దేశసేవ – మహాత్మాగాంధీ