కదంబం – సాహిత్య కుసుమం

 

తిరుమలేశుని మధుర నామం
- గంజాం భ్రమరాంబ

 


అమ్మ గోరుముద్దులతో...
నేర్పినట్టి వెంకన్న నామం

నాన్న వేలుపట్టి...
దిద్దించిన  వెంకన్న నామం

నాయనమ్మ కథలతో
మదినిండిన వెంకన్ననామం

భక్తుల పరవశ గానాలతో
నినదించిన వెంకన్న నామం

భజనలతో కోలాటాలతో
పులకించిన వెంకన్న నామం

తిరుమల కొండలన్నీ
అనునాదం చెందిన వెంకన్న నామం

ప్రజల మనసులలో నిరంతరం
ప్రతిధ్వనించే వెంకన్న నామం

పిలిచినంతచాలు..
పలుకరించే వెంకన్న నామం

కలియుగ వైకుంఠంలో
ఓంకార ప్రణవ నాదం.. వెంకన్న నామం

మనసారా కొలిచే వారికి
ఆసరాగా నిలుచు..వెంకన్న నామం

గోవిందా... గోవిందా...
గోవిందా.. గోవిందా..

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

దేశసేవ అంటే ఉపన్యాసాలు దంచడం కాదు – ఎవరి విధిని వారు సక్రమంగా నిర్వర్తించగలగడం. అదే అసలైన దేశసేవ – మహాత్మాగాంధీ