Songs

 

ప్రకృతి సహజ అందాల స్వాభావిక చైతన్యం ఎనలేనిది. అటువంటి అందమే మన జీవితంలో మకరందమై ఎంతో ఆనందాన్ని ఇస్తుందని, కష్టాలు వచ్చినపుడు వెఱవక ఎదురొడ్డి నిలబడి నెగ్గితే వచ్చే అనుభూతి ఎంతో విలువైనదని, అది కలకాలం నిలుస్తుందని చెప్పకనే చెబుతున్న ఈ అందమే ఆనందం ..ఆనందమే జీవిత మకరందం పాట ఈ నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా మీ కోసం అందిస్తున్నాం.


చిత్రం: బ్రతుకు తెరువు (1953)

సంగీతం: ఘంటసాల

సాహిత్యం: సముద్రాల

గానం: ఘంటసాల

 


అందమే ఆనందం... అందమే ఆనందం....
ఆనందమే జీవిత మకరందం... అందమే ఆనందం....
అందమే ఆనందం... అందమే ఆనందం....
ఆనందమే జీవిత మకరందం... అందమే ఆనందం....

పడమట సంధ్యా రాగం, కుడియెడమల కుసుమపరాగం
పడమట సంధ్యా రాగం, కుడియెడమల కుసుమపరాగం
ఒడిలో చెలి మోహనరాగం... ఒడిలో చెలి మోహనరాగం...
జీవితమే మధురానురాగం... జీవితమే మధురానురాగం...

అందమే ఆనందం...
ఆనందమే జీవిత మకరందం... అందమే ఆనందం....

పడి లేచే కడలి తరంగం, ఓ...ఓ...ఓ...
పడిలేచే కడలితరంగం, వడిలో జడిసిన సారంగం
పడిలేచే కడలితరంగం, వడిలో జడిసిన సారంగం
సుడిగాలిలో.......ఓ... ఓ... ఓ...
సుడిగాలిలో ఎగిరే పతంగం,
జీవితమే ఒక నాటకరంగం... జీవితమే ఒక నాటకరంగం
అందమే ఆనందం...
ఆనందమే జీవిత మకరందం... అందమే ఆనందం....
ఓ.... ఓ... ఓ.... ఓ.... ఓ .....

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

దేశసేవ అంటే ఉపన్యాసాలు దంచడం కాదు – ఎవరి విధిని వారు సక్రమంగా నిర్వర్తించగలగడం. అదే అసలైన దేశసేవ – మహాత్మాగాంధీ