సామెతల ఆమెతలు
సమీకరించినది: వెంపటి హేమ (కలికి)

గత సంచిక తరువాయి »

గత రెండు సంచికలలో సామెతల గురించిన ఉపోద్ఘాతము మరియు విశ్లేషణ అందించాను. ఒకటా, రెండా, వేలకొలది సామెతలు మన తెలుగు భాషలో, జనజీవన స్రవంతిలో నుండి పుట్టి ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొన్నాయి. ఇక ఇప్పుడు నేను సమీకరించిన సామెతల వెల్లువను మీకు అందిస్తున్నాను.

౩౧. ఇల్లు ఇరకటం - ఆలి మర్కటం!
౩౨. అదృష్ట హీనునికి ఆముదం ఒంటికి రాసుకుని దొల్లినా ఒక్క రేణువుకూడా ఒంటికి అంటదు.
౩౩. రాశి బాగుంటే చాలు రాత బాగుంటుంది.
౩౪. పొట్టివాడికి పొట్టనిండా బుద్ధులే !
౩౫. మంగలాడిని చూసి ఎద్దు కాలు కుంటిందిట!
౩౬. పిట్ట పిసరు, పీక బాకా!
౩౭. కొత్తొక వింత, పాతొక రోత.
౩౮. కుక్కతోక వంకర ఎప్పటికీ పోదు.
౩౯. చెరపకురా చెడేవు.
౪౦. ఎవరు తవ్వుకున్న గోతిలో వారే పడతారు.
౪౧. వయసు వస్తే వంకరకాళ్ళు సరవుతాయి.
౪౨. ఆడలేక మద్దెల ఓడు - అన్నట్లు...
౪౩. తొండ ముదిరి ఊసరవెల్లి అయ్యింది!
౪౪. కోరి, కోరి కొడుకుని కంటే మూగా చెముడు ముంచుకు వచ్చాయి!
౪౫.  కొత్తనీరు వచ్చి పాతనీరును కూడా పట్టుకు పోయింది!
౪౬. అలవిమాలిన చోట ఆధిక్యం చూపించకూడదు.
౪౭. ముంజేతి కంకణానికి అద్దం కావాలా!
౪౮. చక్కనమ్మ చిక్కినా అందమే, సన్నని బట్ట మాసినా అందమే!!  
౪౯. పిండినిబట్టి రొట్టె , జుట్టునుబట్టి జడ ...
౫౦. మింగ మెతుకులేదు గాని, మీసాలకు సంపెంగ నూనెట!
౫౧. గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించిందిట!
౫౨. గడ్డివామిలో పడ్డ సూదికోసం వామంతా గాలించినట్లు ...
౫౩. అండ పిండ బ్రహ్మాండంలో ఆంబోతు రంకె వేసిందిట!
౫౪. విస్తరి నిండా వడ్డించి విస్తరి కొసన ఉమ్మేసినట్లు ...
౫౫. పప్పుతో పది కబళాలు తింటే పులుసెందుకురా బుగ్గిలోకి ..
౫౬. తా చెడ్డ కోతి వనమంతా చెరిచిందిట ...
౫౭. ఈనగాచిన పొలం నక్కలపాలై నట్లు ...
౫౮. తులసి వనంలో గంజాయి మొక్క మొలచినట్లు...
౫౯. మూలిగే నక్కపైన తాటికాయ రాలిపడ్డట్లు ...
౬౦. కుక్కలు మొరిగితే జంగం పరువు పోదు.

 

.....సశేషం.....

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

దేశసేవ అంటే ఉపన్యాసాలు దంచడం కాదు – ఎవరి విధిని వారు సక్రమంగా నిర్వర్తించగలగడం. అదే అసలైన దేశసేవ – మహాత్మాగాంధీ