రాయల్ గార్జ్ వేలాడే వంతెన, కొలరాడో రాష్ట్రం, యు.ఎస్.ఎ.

RG Bridge

సహజమైన ప్రకృతి అందాలతో అలరారుతున్న సుందరమైన పర్వతశ్రేణులు, వాటి మధ్య అఘాతమైన లోయ, అందులో ప్రవహించే నదీ ప్రవాహం. ప్రతి ఋతువులోనూ అందుకు తగినవిధంగా ముస్తాబై చూసే వారికి ఎంతో మనోల్లాసాన్ని కలిగించే ఆ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఎవరు ఉత్సుకత చూపరు? అయితే నిటారుగా ఉన్న ఆ రెండు పర్వతశ్రేణుల మధ్యన ఉన్న ఆ లోయను దాటి అవతలకు వెళ్లేదెలా? ఈ ప్రశ్నకు సమాధానమే 1929 సంవత్సరంలో నిర్మించిన ఈ వేలాడే వంతెన. ఇది ప్రపంచంలోనే అత్యంతోన్నత వేలాడే వంతెన గా పేరుగాంచింది.

RG Bridge

 

ఈ లోయను రాయల్ గార్జ్ అనే పేరుతో పిలుస్తారు. ఈ లోయలో ప్రవహించే నది ఆర్కాన్సాస్ రివర్. ఈ నది ఉత్తర అమెరికాలో ఉన్న పొడవైన నదులలో ఒకటి. ఈ వేలాడే వంతెనను దాదాపు వెయ్యి అడుగుల ఎత్తులో నిర్మించారు.

RG Bridge


నాటి నుండి నేటి వరకు ఎంతో మంది సందర్శకులను ఆకర్షిస్తున్న ఈ వంతెన ఒక విధంగా అతి భయానక వంతెన. ఎందుకంటే మనం నడుస్తుంటే అది ఊగుతూ ఉంటుంది. వంతెన పైనుండి క్రిందకు చూడాలంటే ఒకవిధంగా సాహసమే. మరొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఎత్తు అంటే భయం ఉన్న వారు, ఈ వంతెన పైకి వెళ్ళకుండా, క్రింద నది పక్కనే ఉన్న రైల్లో ప్రయాణించవచ్చు. ఆ రైలు ఈ వంతెన క్రిందనుండే వెళుతుంది.

RG Bridge


ఈ వంతెన చుట్టుపక్కల వివిధ రకాల రైడ్స్, బంగీ జంప్ ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా పెద్ద పార్క్ ను నిర్మించారు. ప్రతి సంవత్సరం వేలమంది ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు.

కేనన్ పట్టణం నుండి ఈ వంతెనకు నిమిషాలలో చేరుకోవచ్చు. ప్రముఖ పర్యాటక కేంద్రమైన కొలరాడో స్ప్రింగ్స్ నుండి ఒక గంట ప్రయాణం. పశ్చిమ అమెరికాలో ప్రముఖ నగరమైన డెన్వర్ నుండి రెండు గంటలలో ఈ వంతెనను చేరుకోవచ్చు.

 

Source01, Source02

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

దేశసేవ అంటే ఉపన్యాసాలు దంచడం కాదు – ఎవరి విధిని వారు సక్రమంగా నిర్వర్తించగలగడం. అదే అసలైన దేశసేవ – మహాత్మాగాంధీ