Songs

 

ప్రేమ అనే రెండక్షరాల పదం రెండు మనసులను దరిచేర్చి కలకాలం స్థిరంగా ఉండే బంధాన్ని ఏర్పరిచే అపురూపమైన అక్షరస్వరం. ఆ ప్రేమ లోతుల్లో మునిగిన రెండు మనసులలో ఎన్నో చెప్పలేని మధురానుభూతులు సదా జనిస్తూనే ఉంటాయి. అందులో భాగంగానే అబ్బాయి మనసులో ఒక అమ్మాయి మీద జనించిన ప్రేమను వ్యక్తపరుస్తూ “ఎవరే ప్రేమను మాయంది” అది మాయ కాదు నీ తలపులతో నాలో కలిగే అపురూపమైన అనుభూతి అంటూ తన ప్రేయసి గురించి చెప్పిన మాటల ఈ పాట ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మీకోసం.


చిత్రం: ప్రేమమ్ (2016)

సంగీతం: రాజేష్ మురుగేశన్

సాహిత్యం: శ్రీమణి

గానం: విజయ్ యేసుదాస్

 


పల్లవి:

తెలవారితె కనురెప్పల తొలి మెలకువ నువ్వే
నా గుప్పెడు గుండెల్లో చిరు చప్పుడు నువ్వే
పొలమారితె నీ మనసుకి అది నా పొరపాటే
నీ పేరే పలకడమే పెదవులకలవాటే

వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే
వేకువలా చూస్తుందే నువు నడిచిన బాటే

ప్రాణాలే తీస్తుందే నీ ఊహలతోటే
నా మనసే నీదయ్యే వినదే నా మాటే

ఎవరే .. ఎవరే ప్రేమను మాయంది
ఎవరే ... ఈ హాయికి హ్రుదయము చాలంది

చరణం 1:

ఎవరే నిన్నే నా వైపు నడిపె
నా ఊహల మదురోహల హరివిల్లు నింపె

తియతీయని నిమిషాలే నీలొన ఒంపే
నా ఒంటరి కాలాన్నే నీతోన చెరిపేయ్

ఆ దైవమే నాకు చెప్పింది ఎపుడో
నీ చిన్ని చిరునవ్వే విలువైన వరమంటు

నా ప్రాణమే నీకు చెపుబుతోంది ఇపుడు
నువు లేక నే లేనని

గదిలాంటి మదిలో నదిలాంటి నిన్నే
దాచేయాలనుకుంటే అది నా అత్యాశే

అడుగంత నువు దూరమైనా
నా ఊపిరి చిరునామా తెలిపేదెవరే ||ఎవరే||

చరణం 2:

వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే
వేకువలా చూస్తుందే నువు నడిచిన బాటే

ప్రాణాలే తీస్తుందే నీ ఊహలతోటే
నా మనసే నీదయ్యే వినదే నా మాటే

 

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

మనిషి క్రోధాన్ని దయాగుణంతోనూ, చెడుని మంచిగుణంతోనూ జయించాలి – గౌతమ బుద్ధుడు