సామెతల ఆమెతలు
సమీకరించినది: వెంపటి హేమ (కలికి)

గత సంచిక తరువాయి »

౬౧.  పిచిక పిసరు, కూత ఘనం!
౬౨. పెద్దలమాట చద్దన్నం మూట.
౬౩. గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించిందిట!
౬౪. విత్తు ముందా, చెట్టు ముందా?
౬౫. ఏనుగుని చూసి కుక్కలు మొరుగుతాయి.
౬౬. పట్టపగలు చుక్కల పొడిచినట్లు ...
౬౭. "బ్రహ్మచారి శత మర్కటః" ...
౬౮. నీతిలేనివాడు కోతికంటే పాడు.
౬౯. తాడి క్రింద కూచుని పాలు తాగినా కల్లనే అనుకుంటారు.
౭౦. నువ్వొకందుకు పోస్తే, నేనొకందుకు తాగా ...
౭౧. పెళ్ళంటే నూరేళ్ళ పంట! (పెంట కాదు.)
౭౨. అరచేతిలో అరచుక్క తేనె వేసుకుని, మోచేతిదాకా నాకమన్నాడుట!
౭౩. తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదరవు.
౭౪. ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలడు.
౭౫. పిల్లికి బిచ్చం పెట్టడు.
౭౬. లేదు నారాయణా, పోదు నారాయణా ...
౭౭. మీ ఇంట్లో భోజనం చేసి వచ్చి, మా ఇంట్లో చెయ్యి కడుక్కోండి ...
౭౮. అడిగితేగాని అమ్మైనా పెట్టదు...
౭౯. పాలకోసం రాయిని మొయ్యక తప్పదు .
౮౦. ఇంటిలో ఈగలమోత, బయట పల్లకీలమోత...
౮౧. ఎడ్డెం అంటే తెడ్డెం అన్నట్లు ...
౮౨. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు - అన్నట్లు!
౮౩. దిక్కులేనివారికి దేవుడే దిక్కు.
౮౪. అసలువాడు గొడ్డు గేదె - అంటే, పొరుగువాడు పాడి గేదే - అన్నాడుట!
౮౫. పాలున్నప్పుడే వండుకోవాలి పరమాన్నం.
౮౬. అంతా పల్లకీ ఎక్కితే, ఇక దాన్ని మోసే వాడెవరు?
౮౭. గేదెను నీటిలో దింపి, కొమ్ములు చూపించి బేరం పెట్టినట్లు...
౮౮. లంక మేత - గోదావరీత!
౮౯. పిల్లికి ఎలుక సాక్ష్యమా!
౯౦. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానందిట!

 

.....సశేషం.....

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

మనిషి క్రోధాన్ని దయాగుణంతోనూ, చెడుని మంచిగుణంతోనూ జయించాలి – గౌతమ బుద్ధుడు