సామెతల ఆమెతలు
సమీకరించినది: వెంపటి హేమ (కలికి)

గత సంచిక తరువాయి »

౯౧. వయసొస్తే చాలు, వంకరకాళ్ళు తిన్ననౌతాయి.
౯౨. తినడానికేముంది - అని అడిగితే - ఉట్టిక్రింది మట్టి, పొయ్యిలో బూడిద - అందిట!
౯౩. చింత చచ్చినా పులుపు చావదు.
౯౪. అచట పుట్టిన చిగురు కొమ్మయిన చేవ!
౯౫. ఇద్దరి పెళ్ళాల మొగుడు ఇరుకునపడి చచ్చాడు.
౯౬. కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకు కోపం ...
౯౭. కీలెరిగి వాతపెట్టాలి.
౯౮. కాలు బెసిగితేగాని గంగానమ్మయినా కొట్టదు.
౯౯. శీవి(filth) లో పడినదెల్లా శివార్పణం - అన్నట్లు !
౧౦౦. సీత గీత దాటింది!
౧౦౧. మాటలు కోటలు దాటాయి గాని, మనిషి గడప దాటలేదు.
౧౦౨. కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువ!
౧౦౩. తల్లికి బిడ్డ, చెట్టుకి కాయలు భారం కాదు.
౧౦౪. కాకిపిల్ల కాకికి ముద్దు.
౧౦౫. ఈ ఇంటి మీది కాకి ఆ ఇంటి మీద వాలదు.
౧౦౬. విత్తు ముందా - చెట్టు ముందా?
౧౦౭. ఇంట గెలిచి రచ్చ గెలువు.
౧౦౮. నెయ్యకు గిన్ని ఆధారమా లేక గిన్నెకు నెయ్యి ఆధారమా ...
౧౦౯. రాత బాగుంటే చాలు రాతిమీద విత్తినా రాజనాలు పండుతాయి.
౧౧౦. ఆకుని అంటకుండా, పోకని పొందకుండా, సున్నాన్ని చూడకుండా నోరు పండాలి అంటే ఎలాగ!
౧౧౧. ఇచ్చీ కట్నం ఇచ్చి, పిచ్చివాడికి పిల్లనిచ్చినట్లు ...
౧౧౨. ఆ రెండిళ్ళ నడుమా పచ్చగడ్డి వేసినా భగ్గుమంటుంది!
౧౧౩. పిల్లకాకి కేం తెలుసు ఉండేలు దెబ్బ!
౧౧౪. నక్కపుట్టి నాలుగు వారాలు కాలేదు గాని, ఇంతపెద్ద గాలివాన నేనెప్పుడూ ఎరుగానందిట!
౧౧౫. రాయగా రాయగా రాయైనా అరిగిపోతుంది ...
౧౧౬. చీమలు తిన్నా కొండలు తరుగుతాయి.
౧౧౭. కూర్చుని తింటే కొండలు కరుగుతాయి.
౧౧౮. గొర్రెపొట్టేలు కొండను ఢీ కొడితే విరిగేవి దాని కొమ్ములే ...
౧౧౯. ఉపాయం చెప్పరా అంటే ఉరేసుకోడం మంచిదన్నాడుట!
౧౨౦. మబ్బు లేనిదే వాన ఎలా వస్తుంది ?

 

.....సశేషం.....

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

మనమీద మనకున్న అదుపు ఒక గొప్ప సంపద. అందుకే మనల్నిమనము సదా పరీక్షించుకుంటూ ఉండాలి – రస్సెల్