Tookiga


తెలుగు సంవత్సరాలు

విళంబి నామ సంవత్సర శుభాకాంక్షలు

మనందరికీ తెలుసు మన తెలుగు సంవత్సరాలు 60. అయితే వాటి పేర్లు వాటి పుట్టు పూర్వోత్తరాలు అతికొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈ ఉగాది సంచిక సందర్భంగా మన తెలుగు సంవత్సరాల పేర్లు, టూకీగా మీకు అందిస్తున్నాను.

అసలు మనకు 60 సంవత్సరాలే ఎందుకున్నాయి అనే ప్రశ్నకు ఒక చిన్న కథ రూపంలో నాకు సమాధానం దొరికింది.

నారదమహాముని ఓసారి విష్ణు మాయ వల్ల స్త్రీగా మారి, ఓ రాజును పెళ్లాడతాడు. వారి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా వారికి 60 మంది పుత్రులు జన్మిస్తారు.  ఆ పుత్రులందరూ పెద్దవారై అన్ని విద్యలూ నేర్చుకొని ఓసారి తమ తండ్రితో కలిసి యుద్ధానికి వెళతారు. దురదృష్టవశాత్తూ అందరూ ఆ యుద్దంలో చనిపోతారు. పుత్రశోకంతో కుమిలిపోతున్న నారదుడిని విష్ణువు కరుణించి, నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని ఒక వరం ప్రసాదిస్తాడు. ఆ కాలచక్రమే మన పంచాంగమై, ఆ పుత్రుల పేర్లతోనే మన తెలుగు సంవత్సరాలు ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి. ఆ అరవై పేర్లు ఏమిటో ఒకసారి పరికిద్దాం.

1. ప్రభవ, 2. విభవ, 3. శుక్ల, 4. ప్రమోదూత, 5. ప్రజోత్పత్తి, 6. ఆంగీరస, 7. శ్రీముఖ, 8. భా(భ)వ, 9. యువ, 10. ధాతు, 11. ఈశ్వర, 12. బహుధాన్య, 13. ప్రమా(థి) ధి, 14. విక్రమ, 15. విషు (వృష), 16. చిత్రభాను, 17. స్వభాను, 18. తారణ, 19. పార్థివ, 20. వ్యయ, 21. సర్వజిత్తు, 22. సర్వధారి, 23. విరోధి, 24. వికృతి, 25. ఖర, 26. నందన, 27. విజయ, 28. జయ, 29. మన్మథ, 30. దుర్ముఖి, 31. హేవళంబి, 32. విళంబి, 33. వికారి, 34. శార్వరి, 35. ప్లవ, 36. శుభకృత్తు, 37. శోభకృత్తు, 38. క్రోధి, 39. విశ్వావసు, 40. పరాభవ, 41. ప్లవంగ, 42. కీలక, 43. సౌమ్య, 44. సాధారణ, 45. విరోధికృత్తు, 46. పరీధావి, 47. ప్రమాదీచ (ప్రమాది), 48. ఆనంద, 49. రాక్షస, 50. నల, 51. పింగళ, 52. కాళయుక్తి, 53. సిద్ధార్థి, 54. రౌద్రి, 55. దుర్మతి, 56. దుందుభి, 57. రుధిరోద్గారి, 58. రక్తాక్షి, 59. క్రోధన, 60. అక్షయ.

ప్రస్తుతం మనం 32వ సంవత్సరంలోకి అడుగిడబోతున్నాము.

నూతన సంవత్సర శుభాకాంక్షలు

 

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

మనమీద మనకున్న అదుపు ఒక గొప్ప సంపద. అందుకే మనల్నిమనము సదా పరీక్షించుకుంటూ ఉండాలి – రస్సెల్