Recipes


గోధుమరవ్వ పాయసం

కావలసినవి:

చేయు పద్దతి:

  1. ఒక బాణలిలో నెయ్యి వేసి, వేడి చేయాలి. అందులో జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఏలకులు వేసి, జీడిపప్పు గోధుమ రంగు వచ్చు వరకు వేయించాలి. వీటిని తీసి ప్రక్కన పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు ఆ బాణలిలోనే గోధుమరవ్వను వేసి, రంగు మారునంత వరకు వేయించాలి. తర్వాత పంచదార వేసి బాగా కలపాలి.
  3. అటు పిమ్మట పాలు, నీళ్ళు వేసి బాగా కలిపి, సన్నని మంటపై, రవ్వ బాగా మెత్తగా ఉడుకునంత వరకు ఉంచాలి.
  4. ఈ మిశ్రమం చిక్కబడిన తరువాత, మంటను కట్టేసి, స్టవ్ పైనే కాసేపు వదిలేయాలి.
  5. కాసేపటి తర్వాత ఈ కమ్మ కమ్మని పాయసాన్ని, వేరే గిన్నె లోకి మార్చి, ఇదివరకు వేయించి పెట్టుకొన్న జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఏలకులను పైన వేసి బాగా కలపాలి.
  6. అంతే!! ఎంతో రుచికరమైన గోధుమరవ్వ పాయసం రెడీ!!

 

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

మనమీద మనకున్న అదుపు ఒక గొప్ప సంపద. అందుకే మనల్నిమనము సదా పరీక్షించుకుంటూ ఉండాలి – రస్సెల్