Tookiga


మొక్కజొన్న – ఉపయోగాలు

Corn

మొక్క జొన్న అంటే మనకు గుర్తుకు వచ్చేది రోడ్డు ప్రక్కన బండిమీద కాల్చి కారం ఉప్పు దట్టించిన కంకులు. లేదంటే సినిమాకి వెళ్ళినప్పుడు మనకు మంచింగ్ కొరకు తినే పాప్ కార్న్. అయితే మొక్క జొన్నతో అనేక విధములైన పదార్థాలు తయారౌతాయని నాకు ఈ మధ్యనే తెలిసింది. అది మీతో పంచుకోవాలని నా ఉబలాటం.

పైన చెప్పిన పదార్థాల విషయం ఒక ఎత్తు. మరి మన రాజకీయ నాయకులు ఇప్పుడు మొక్కజొన్న వాడి తయారుచేసిన వాహనాలను తమ ప్రచారానికి కూడా వాడుకునే ఆలోచనలో ఉన్నారని ఈ మధ్యనే ఒక స్నేహితుని ద్వారా విన్నాను. బహుశా ఆ వాహనంలో ఇంధనం ఖర్చు లేకుండా చల్లగా ఉంటుందేమో!

corn-house-China


చైనా వాసులు ఇంకొంచెం ముందుకు పోయి ముప్పైవేల మొక్క జొన్న కంకులతో ఏకంగా 30 మీటర్ల పొడవు, నాలుగు మీటర్ల వెడల్పుతో ఉండే ఒక ఇంటినే నిర్మించారు. ఆ ఇల్లు ఇప్పుడు ఒక పెద్ద విశేషమై ఎంతో మంది పర్యాటకులను ఆకర్షిస్తోంది. అదండీ మన మొక్కజొన్న చరిత్ర.

 

Source1 »
Source1 »

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

చెప్పేవాడూ, వినేవాడూ ఉన్నచోటే సంపదలు విహరిస్తాయి – విక్రమార్కచరితం