Tookiga


ప్రాచీన సంస్కృతిని పరిరక్షించే అద్భుత రేఖాకృతులు

Maze


ఉత్తర అమెరికా ఖండంలో అక్టోబర్ నెలలో మొక్కజొన్న పంట చాలా బాగా వస్తుంది. అయితే కంకులు అన్నీ కోసేసిన పిదప, ఆ కాండాలను ఆకులతో అట్లాగే ఉంచి పెద్ద ‘మేజ్’ అని లోనికి ప్రవేశిస్తే బయటకు రావడానికి మహాచిక్కైన దారులతో నిర్మిస్తారు. అక్కడకు వెళ్లి ఆ మేజ్ లో నుండి బయటకు రావడం అనేది ఒక మంచి అనుభూతితో కూడిన ఆట. ఈ కార్న్ మేజ్ అన్ని వయసు వాళ్ళను ఎంతగానో ఆకర్షిస్తుంది.

Mazeఅయితే ఈ మేజ్ యొక్క చరిత్రను గమనిస్తే, ఇది ఎన్నో వందల ఏళ్ల నుండి ఒక సంప్రదాయ క్రీడ గా ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. పాత రోజులలో ముఖ్యంగా 16 వ శతాబ్దంలో రష్యాలో ఈ విధమైన చిక్కు దారులతో కష్టమై చాల తిరుగుళ్లుగల ప్రదేశాలను ఎంతో వ్యూహాత్మకంగా గడ్డితో మరియు కొన్ని చోట్ల రాళ్ళతో కూడా నిర్మించారు. వీటిని ఆంగ్లంలో labyrinth అని అంటారు.

Maze


ఈ మేజ్ ల నిర్మాణం ముఖ్యంగా నాడు, నేడు కూడా ఒక విధంగా సమయాన్ని వెళ్ళబుచ్చడానికి అనువుగా రూపొందించారని అనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి ఆ మేజ్ లోపలి వెళితే మరల బయటకు రావడానికి కొన్ని గంటలు పడుతుంది. కొన్ని సందర్భాలలో మధ్యలో ఏదైనా ఎత్తైన ప్రదేశానికి వెళ్లి బయటకు వెళ్ళే దారిని కనుక్కొని తదనుగుణంగా దారులు వెదుక్కొని బయటకు రావడం జరుగుతుంది. ఏది ఏమైనా ఈ మేజ్ లోకి వెళ్లి దారితప్పి పోవడం అనే ప్రక్రియను ప్రత్యక్షంగా అనుభవించవచ్చు.

Maze

 

Source1 »
Source2 »
Source3 »

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

మసలే వేడి నీళ్ళు కూడా నిప్పును చల్లార్చగలుగుతాయి – గాథాసప్తశతి