కరివేపాకు

Karivepaku


మనలో కొంతమంది ఎంతో సదుద్దేశంతో అందరికీ సహాయం చేస్తూ అన్నింటా తామే అన్నట్లు ఉంటారు. అయిననూ వారి మంచిని, సహాయాన్ని సరిగా గుర్తించనందున అందరికీ దూరమౌతుంటారు. అటువంటి వారిని మనం ‘కూరలో కరివేపాకు’ అని అంటుంటాం. వారి వలన ఎంతో మేలు జరిగినను వారిని దూరంగా ఉంచుతుంటాం. అలాగే కరివేపాకు ఎన్నో మంచి పోషకాలతో కూడి, మనం తయారుచేసిన ఆహారంకు మంచి రుచి, వాసన వచ్చేటట్లు చేసినను, మనం తినేటప్పుడు కరివేపాకు ఆకులను తీసి ప్రక్కన పడేస్తాము.

Karivepaku


కానీ, కరివేపాకుకు ఎన్నో మంచి ఔషధ గుణాలు వున్నాయని తెలిస్తే ఆహారంతో పాటు ఆ ఆకులను కూడా తినేస్తాం కదా. కరివేపాకుకు కాన్సర్ కారకాలను కట్టడి చేసే గుణం మెండుగా ఉంది. కరివేపాకు లో సినమాల్డిహైడ్, దంతక్షయాన్ని, నోటిదుర్వాసనను అరికట్టే గుణం కలిగిఉంది. అలాగే రక్తంలో ఉన్న ప్లేట్ లెట్స్ గడ్డకట్టకుండా నిరోధిస్తుంది. అలాగే కరివేపాకు లో పుష్కలంగా ఉన్న కార్బజోల్ అల్కలైడ్స్ వివిధ రకాలైన వాపుల నుండి రక్షిస్తాయి. మరియు యాంటి ఆక్సిడెంట్ గా కూడా పనిచేస్తాయి. అంతేకాదు శరీరంలోని చక్కెర శాతాన్ని కూడా తగ్గించే గుణం కరివేపాకు కు ఉందని ఈ మధ్యనే పరిశోధనలలో తేలింది.

పెరట్లో కరివేపాకు, తులసి, అలోవేరా, నిమ్మ తదితర చెట్లు ఉంటే మనకు పుష్కలమైన స్వచ్ఛమైన గాలి లభించినట్లే.

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

ఏ ఘనకార్యాన్ని మోసంతో సాధించలేం. అప్రతిహతమైన శక్తి ద్వారా మాత్రమే సమస్త కార్యాలు సాధించబడతాయి. కాబట్టి ధీరత్వాన్ని ప్రదర్శించండి. – స్వామి వివేకానంద