అమూల్య సాహితీ భాండాగారం

ఈ మధ్య నా మిత్రుడొకరు ఒక వెబ్సైటు గురించీ, అందులో పొందుపరిచిన సమాచారం గురించి చెబితే ఆ వెబ్సైటు వీక్షించిన తరువాత ఆశ్చర్యపోవడం నా వంతైంది. ఎందుకంటే అందులో నిక్షిప్తపరిచిన సమాచారం మనకు ఎక్కడా కనపడదు. ఉదాహరణకు పదకవితామహుడు అన్నమయ్య రాగి రేకుల మీద ఆ ఆపదమొక్కులవాడిని స్తుతిస్తూ వ్రాసిన కీర్తనలు, వేదాంత రహస్యాలను వ్యవహారిక భాషలో సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా వ్రాసిన వెంగమాంబ రచనలు ఇలా ఎంతో విలువైన సమాచారం ఈ ఒకే ఒక్క వెబ్ సైట్ లో పొందుపరిచారు. అంతేకాదు ఈ విలువైన మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని ఆరు భాషలలో అనువదించి అందించారు.

ఈ బృహత్‌ ప్రయత్నానికి శ్రీకారం చుట్టిన ‘విశ్వవ్యాప్త అన్నమయ్య భక్త బృందం’ సభ్యులు శ్రీ పూర్ణదయాళ్‌ మరియు ఆయనకు సహకరించిన ముఖ్యులు నిజంగా అభినందనీయులు. మన భారతదేశ దేశంలో పేరొందిన 12 మంది వాగ్గేయకారులకు చెందిన 29,024 కీర్తనలను సేకరించి ఆరు భాషల్లోకి అనువదించి వారి వెబ్సైటు www.annamayya.in నందు పొందుపరిచారు. ఇంత కృషి సల్పిన ఈ బృంద సభ్యలు మరి ఇదంతా వ్యాపార దృష్టితో చేస్తున్నారా అంటే నిస్సందేహంగా లేదు, కాదు అని చెప్పవచ్చు. ఇది పూర్తిగా మన సంస్కృతి, సాహితీ సంపదను భద్రపఱచి భావితరాలకు అందించాలనే సంకల్పం మాత్రమే.

ఆరు భాషలలో అన్నమయ్య కీర్తనలు, తరిగొండ వెంగమాంబ రచనలు, భక్తతుకారం అభంగాలు, భక్త రామదాసు కీర్తనలు, సమర్థ రామదాసు కావ్యాలు మరెన్నో అమూల్య సాహితీ సంపదలు ఈ వెబ్సైటు లో మనం చూడవచ్చు.

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

మనిషి తనని తానూ తెలుసుకుంటే భగవంతుణ్ణి తెలుసుకున్నట్లే – రామకృష్ణ పరమహంస