Songs

 

ప్రకృతి అందాలకు పరవశించి మనోల్లాసం పొందని ప్రాణి ఈ సృష్టిలో కానరాదు. అతి ముఖ్యంగా వసంత కాలంలో కోయిలల పిలుపులు, చిగురుటాకుల సవ్వడులు, పచ్చదనం పరిచినట్టు ఉండే సహజమైన మార్పులకు తనువులు పులకించక మానవు. ప్రేమికుల మధ్యన కలిగే భావావేశ స్పందనలు ఇటువంటి వాతావరణంలో రెట్టింపు అవుతాయి. ఆ భావావేశాలకు అక్షర రూపం కల్పించి, మహాకవి, నాటి ప్రముఖ గేయ రచయిత పింగళి గారు ఈ పాటను రచించగా, పెండ్యాల గారు తమ స్వరకల్పనతో ఆ భావాలకు మరింత వన్నెను, వెన్న వలె అద్ది మనోహరంగా మనకు అందించారు. ఇక ఘంటసాల, సుశీల గార్లు తమ గాత్ర సంపదతో మన చెవులకు వీనుల విందు కల్గించారు.


చిత్రం: శ్రీకృష్ణార్జునయుద్ధం (1963)

సంగీతం: పెండ్యాల

గేయ రచయిత: పింగళి

గానం: ఘంటసాల, సుశీల


పల్లవి:

ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
మనసు పరిమళించెనే.. తనువు పరవశించెనే
నవ వసంత గానముతో.. నీవు నటన సేయగనే
మనసు పరిమళించెనే.. తనువు పరవశించెనే
నవ వసంత రాగముతో.. నీవు చెంత నిలువగనే
మనసు పరిమళించెనే.. తనువు పరవశించెనే

చరణం 1:

నీకు నాకు స్వాగతమనగా కోయిలమ్మ కూయగా
ఆ..... ఆ.... . ఆ..... ఆ....
నీకు నాకు స్వాగతమనగా కోయిలమ్మ కూయగా
గలగలగల సెలయేరులలో కలకలములు రేగగా
మనసు పరిమళించెనే.. ఆ.హా..హా.. హా..
తనువు పరవశించెనే.. ఓ..ఓ..ఓ..
నవ వసంత గానముతో... నీవు చెంత నిలువగనే
మనసు పరిమళించెనే... తనువు పరవశించెనే

చరణం 2:

క్రొత్త పూల నెత్తావులతో మత్తుగాలి వీచగా
ఆహా .. ఆ .. ఆ .. ఆ…
క్రొత్త పూల నెత్తావులతో మత్తుగాలి వీచగా
భ్రమరమ్ములు గుములు గుములుగా... ఝుం ఝుమ్మని పాడగా
మనసు పరిమళించెనే... తనువు పరవశించెనే

చరణం 3:

తెలి మబ్బులు కొండ కొనలపై హంసల వలె ఆడగా
అహా .. ఆ . అ.. ఆ.. ఆ . అ.. ఆ
తెలి మబ్బులు కొండ కొనలపై హంసల వలె ఆడగా
రంగరంగ వైభవములతో ప్రకృతి విందు సేయగా
మనసు పరిమళించెనే... తనువు పరవశించెనే
నవ వసంత రాగముతో నీవు చెంత నిలువగనే
మనసు పరిమళించెనే... తనువు పరవశించెనే

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

అభిమానవంతుడు ఎన్ని కష్టాలు వచ్చినా చెడ్డపనులు చేయడు – భర్తృహరి