సామెతల ఆమెతలు
సమీకరించినది: వెంపటి హేమ (కలికి)

గత సంచిక తరువాయి »

౩౨౧. యధా రాజా - తధాప్రజా!
౩౨౨. ఏ గూటి చిలక ఆ గూటి పలుకు పలుకుతుంది....
౩౨౩. గువ్వా గూడెక్కె , రాజు మేడెక్కె ...
౩౨౪. గూట్లో దీపం, నోట్లో ముద్దా...
౩౨౫. సీత కష్టాలు సీతవైతే, పీత కష్టాలు పీతవి.
౩౨౬. రోలు వెళ్లి, మద్దెలతో మొర పెట్టుకుందిట!
౩౨౭. తా దూర కంత లేదుగాని, మెడకో డోలుట!
౩౨౮. ఓడ ఎక్కేముందు ఓడ మల్లన్న, ఓడ దిగాక బోడి మల్లన్న!
౩౨౯. ఊరినిండా అప్పులున్నా, తల నిండా పేలు ఉన్నా బాధ ఉండదు.
౩౩౦. చాప కింది తేలులా ...
౩౩౧. చెప్పేవన్నీ శ్రీరంగనీతులు, దూరేవి మాత్రం దొమ్మరి గుడిసెలు...
౩౩౨. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది.
౩౩౩. బురదలో పుట్టినా తామరపువ్వులా బ్రతకాలి.
౩౩౪. హోరుగాలిలో దీపం పెట్టి, దేవుడా నీ మహిమ చూపు - అన్నట్లు...
౩౩౫. బ్రతకని బిడ్డ బారెడు!
౩౩౬. చచ్చినవాడి కళ్ళు చారెడేసి...
౩౩౭. చచ్చేవాడి పెళ్ళికి వచ్చిందే కట్నం.
౩౩౮. మంత్రాలకు చింతకాయలు రాలవు.
౩౩౯. కాలు జారినా కూడదీసుకోవచ్చుగాని, నోరు జారితే మరి కూడదీసుకోలేము.
౩౪౦. వినాశకాలే విపరీత బుద్ధిః !
౩౪౧. చెరుకు తిన్న నోరు చేదు తినదు.
౩౪౨. పేదవాని కోపం పెదవికి చేటు.
౩౪౩. దంపినమ్మకి బొక్కిందే కూలి.
౩౪౪. కంటికి పెద్దది, చేతికి చిన్నది.
౩౪౫. ఊరు పోమ్మంటోంది, కాడు రమ్మంటోంది.
౩౪౬. తెలివి తక్కువ, ఆకలెక్కువ.
౩౪౭. సూది బెజ్జమంత నోరు, ఆకాశమంత ఆకలి.
౩౪౮ పొట్టివాడికి పొట్టనిండా బుద్ధులే!
౩౪౯. కానిరోజులోస్తే కర్రే పామై కరుస్తుంది.
౩౫౦. తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజు.

 

.....సశేషం.....

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

అభిమానవంతుడు ఎన్ని కష్టాలు వచ్చినా చెడ్డపనులు చేయడు – భర్తృహరి